top of page

మరణమునకు దారితీసిన నిద్ర..

ఇంచుమించు ఒక 30 సంవత్సరముల క్రితము జరిగిన సంఘటన ఇది, ఇప్పుడు చెన్నైగా పిలువబడుతున్న ఆనాటి మద్రాసులో ఒక స్కూల్లో జరిగిన సంఘటన. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఒక స్కూలులో చివరి రోజు అందరూ స్కూల్ ముగించుకుని సమ్మర్ హాలిడేసుకి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న హడావుడిలో, ఆరవ తరగతి చదువుతున్న ఒక బాలుడు తన క్లాస్ రూములో చివరి బెంచి మీద నిద్రలో ఉండిపోయాడు. అది గమనించని సిబ్బంది క్లాసు రూములకు యధావిధిగా తాళం వేసుకుని, మొత్తం స్కూలు మూతవేసి ఎవరి ప్రయాణాన్ని వారు కట్టారు. ఇంటిదగ్గర ఆ బాలుడు కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు అందరి పిల్లలు వచ్చినా, వాళ్ల బాబు రాకపోవడంతో ఖంగారు పడి వెదకడం ప్రారంభించారు. స్కూలు బస్సు నుండి ఎక్కడైనా దిగిపోయాడేమో అన్న కోణంలో వెదికారు ఆ బాబు ఆచూకీ ఎక్కడ దొరకలేదు, పోలీసులకు ఫిర్యాదు చేసారు, పోలీసులు సహితము వివిధ కోణాలలో దర్యాప్తు చేసారుగాని ఆ స్కూలులోనే ఉండిపోయాడేమో అన్న ఆలోచన ఎవరికీ రాలేదు, రోజులు గడుస్తున్న బాబు ఆచూకీ వారికి తెలియలేదు. 90 దినముల సమ్మర్ హాలిడేస్ ముగించబడ్డాయి, ఆ స్కూలు తెరవబడింది, ఆ బాబు ఉన్న ఆ క్లాసు రూములో హృదయాన్ని కదిలించే దృశ్యాలు, ఆ బాబు అస్తిపంజరం అయ్యాడు.

క్లాస్ రూముల గోడలు గోకి గోకి ఉన్నాయి, పుస్తకముల పేపర్ల మీద మమ్మీ డాడీ నన్ను కాపాడండి అని వ్రాసి ఉన్నాయి, భయంకరమైన నరక వాతావరణాన్ని చూసి ఆ బాబు మరణించాడు.

ఇంతటి విషాదకరమైన పరిస్థితికి కారణం నిద్ర.


బైబిలులో కొన్ని నిద్రలు భక్తులకు వినాశనమును తీసుకువచ్చాయి.


నోవాహు త్రాగి మత్తుగా ఉన్న ఆ నిద్ర తన కుమారునికి శాపము తీసుకువచ్చింది. (ఆది 9:21-25).


సంసోను దెలీలా ఒడిలో నిద్రించిన నిద్ర సంసోను అభిషేకము కోల్పోవుటకు కారణమైంది. (న్యాయా16:19).


వసంత కాలమున యుద్ధమునకు పోవలసిన సమయమున మధ్యాహ్నం వేళ దావీదు నిద్రించిన నిద్ర పాపములకు దారిని తీసింది. (2సమూయేలు 16వ అధ్యాయము).


క్రైస్తవ సంఘమునకు‌ అపోస్తులుడైన పౌలుగారు ఇస్తున్న పిలుపు..

ఎఫెసీ5:14

అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.


సామెతలు 6:9-11

సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?,

ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు,

అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.

 
 
 

Recent Posts

See All

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page