దేవుని మీద ఆధారపడవలసిందే
- Elisha Bonnke
- 2 minutes ago
- 2 min read
మనిషి జీవితం మొత్తము ఆధారపడటమే.
ఈ లోకంలో ఏ రంగమైనా ఒకరిమీద ఆధారపడక తప్పదు. కుటుంబము కుటుంబ యజమానిమీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, పని వారు యజమానుల మీద, ప్రజలు నాయకుల మీద, నాయకులు వనరుల మీద ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధారపడవలసినవారే.
చరిత్రలో డా. డి. ఐ. వండర్ పూల్ గారు సమోవా (Samoa) అనే దేశానికి వెళ్లినప్పుడు మనమా అనే ఒక డినామినేషన్ పెద్ద వండర్ పూల్ గారిని సన్మానించి ఫైండ్ మేట్ అనే ఒక మ్యాట్ బహుమానంగా ఇచ్చారు. మీరు ఈ దేశంలో ఉన్నంతకాలము మీకు ఏ అవసరం ఉన్నా ఈ మ్యాట్ మీకు ఆధారం. దీనిని చూపిస్తే ప్రయాణాలు ఉచితం, వైద్యం ఉచితం, పోషణ ఉచితం ఇక్కడ ఉన్నంతకాలం ఈ మ్యాట్ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది విక్టోరియారాణి గారు నిలువబడి మాట్లాడిన మ్యాట్ అని చెప్పినప్పుడు, వండర్ పూల్ గారు ఈ మ్యాట్ మీద నేను ఆధారపడితే ఈ మ్యాట్ నాకు మరణం రాకుండా ఆపగలదా అని సరదాగా అడిగారట.
అవును ఈ లోకములో ఆధారపడేవి ఏవి పరిపూర్ణము కానివి, శాశ్వతం కానివి, మారిపోయేవి.
పరిపూర్ణుడైన వాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడే ఆధారపడదగినవాడు.
దేవుడు కూడా మనుష్యుల నుండి కోరుకుంటున్నది మనుష్యులు వారి స్వబుద్ధిని చేసుకొనక పూర్ణ హృదయముతో ఆయన మీదే ఆధారపడాలి అని.
సామెతలు 3:5
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.
పరిశుద్ధగ్రంథంలో...
గొర్రెలు - కాపరి మీద ఆధారపడ్డాయి
తీగలు - వల్లి మీద ఆధారపడ్డాయి
శిష్యులు - బోధకుని మీద ఆధారపడ్డారు
గొర్రెలు దేవుని మీద ఆధారపడినప్పుడే గొర్రెలకు
క్షేమము మరియు భద్రత
తీగలు వల్లి మీద ఆధారపడినప్పుడే ఎదుగుదల
శిష్యులు బోధకుని మీద ఆధారపడినప్పుడే నేర్చుకొనుట జరిగాయి.
ఈ లోక మనుష్యులు ఆధారపడేది మనుష్యుల మీద, డబ్బు మీద, ఉద్యోగాల మీద, నాయకుల మీద, ప్రభుత్వాల మీదే. మనకందరికీ తెలిసిన సత్యం ఆధారపడే ఇవన్నీ మారిపోయేవి మరియు ఆగిపోయేవే.
మారిపోనిది మారనది దేవుడు మాత్రమే. దేవుని మీద మనము ఆధారపడినప్పుడు దేవునికి ఘనత, దేవుని మీద ఆధారపడినవాడే నిజమైన ఆరాధికుడు.
యెషయా 31:1
సహాయం కొరకు ఐగుప్తుని ఆశ్రయించినవారికి శ్రమ.
కీర్తనలు 20:7
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
కీర్తనలు 40:4
యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
మరి మన నమ్మిక, మన ఆధారం ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటూ...
ఈ నూతన సంవత్సరంలో మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణ హృదయముతో దేవుని మీదే ఆధారపడుదాం, దేవుని కృపలో వర్ధిల్లుదాం.
2 తిమోతికి 2:1
క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.
God bless you all
-Elisha Bonnke



Comments