ఆహారమును దయచేయువాడుదేవుడే
- Elisha Bonnke
- 5 hours ago
- 2 min read
కరువులో ఏ ఆధారం లేని విధవరాలను మరియు తన కుమారుని పోషించిన దేవుడు మన దేవుడు
అరణ్యంలో అవసరమైన పౌష్టిక ఆహారమును దైవజనునికి అందించిన దేవుడు మన మన ప్రభువు
చరిత్రలో ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ఉంటున్నాయి.. ఉంటాయి.
ఎందుకంటే ఆయన మనలను సృష్టించిన సృష్టికర్త.
చరిత్రలో
1) హడ్సన్ టేలర్ గారి జీవితంలో (Hudson Taylor) చైనాలో జరిగిన సంఘటన ఇది.
హడ్సన్ టేలర్ గారు చైనాలో మిషనరీగా సేవ చేస్తున్న రోజుల్లో ఒక రోజు ఆయన కుటుంబం భోజనం చేయుటకు ఆహారం లేని పరిస్థితి,
ఆరోజు ఆయనతో పాటు తన కుటుంబం భోజనం లేకుండా ప్రార్థనలో గడిపారు, అదే రాత్రి ఒక తెలియని వ్యక్తి తలుపు తట్టి, “దేవుడు మీ గురించి నా హృదయంలో తలంపు పెట్టారు”
అని చెప్పి బియ్యం, కూరగాయలు, కొద్ది డబ్బు ఇచ్చి వెళ్లిపోయాడు. అనేక రోజులు ఆ కుటుంబమంతా అదే ఆహారంతో జీవించారు.
హడ్సన్ టేలర్ గారు దేవుని పోషణ కొరకు చెప్పిన గొప్ప మాట
*“దేవుని పనికి దేవుని సరఫరా ఆగదు”*
2) కోరి టన్ బూమ్ (Corrie ten Boom) నాజీ జైల్లో జరిగిన సంఘటన
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొర్రీ టెన్ బూమ్ గారు నాజీ జైల్లో ఉండగా,
ఖైదీలకు చాలా తక్కువ ఆహారం మాత్రమే ఇచ్చేవారు.
ఒక రోజు ఆమె ఉంటున్న చెరసాల విభాగానికి ఆహారం ఇవ్వకూడదని ఆదేశం వచ్చింది, అందరూ ఆకలితో ఉండగా ఆమె ప్రార్థన చేశారు.
ఆశ్చర్యకరంగా వారి విభాగంలో ఖాళీ చేసిన పాత్రలన్ని అక్కడ పెట్టగా అందులో ఒక పాత్రలో ఆహారం ఉంది, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది దానిని తెలియక ఆ పాత్రలను అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయారు.
అందరికీ ఆ రోజు పూర్తిగా సరిపడా భోజనం దొరికింది.
కొర్రీ గారు ఇలా చెప్పారు:
“చెరసాల గోడల మధ్య కూడా దేవుడు మా భోజన టేబుల్ సిద్ధం చేసారు”
3) స్మిత్ విగ్గ్ల్స్ వర్త్ గారు (Smith Wigglesworth) వ్యక్తిగత అనుభవం.
స్మిత్ విగిల్స్‌వర్త్ గారు ఆయన పిల్లల ఆహారము కొరకు చెప్పిన ఒక గొప్ప మాట వాక్యానుసారమైన మాట
“నా పిల్లలు ఆకలితో పడుకోరు.”
ఆయన జీవితంలో కూడా ఒకసారి ఇటువంటి అనుభవం ఎదురయింది ఒక సాయంత్రం భోజనం లేని పరిస్థితుల్లో పక్కింటి వ్యక్తి వచ్చి భోజనము సిద్ధము చేసి పట్టుకొని వచ్చి
“ఈ రోజు మీ కుటుంబం నా మనసులోకి వచ్చింది” అని చెప్పి ఆ ఆహారమును ఆ కుటుంబమునకు ఇచ్చారు.
కీర్తనలు 37:25
నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.
మనుష్యులు మారిన, స్థలాలు మారినా, కాలాలు మారినా, ఉద్యోగాలు మారిన, సంపాదన మార్గం మారిన ఆహారమును ఇచ్చేది దేవుడు మాత్రమే.
ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు వాటికన్నా శ్రేష్టుడుగా ఎంచిన మనుష్యులను ఆయనే పోషిస్తాను అని చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాము, మన ముందున్న దినాలలో ఏమి తిందుము ఏమి త్రాగుదమో అన్న చింత లేకుండా ధైర్యముతో ముందుకు సాగిపోదాం.
మత్తయి 6:25, 26
అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణము,వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
Elisha Bonnke.



Comments