ప్రభువే క్షమిస్తే నేను ఎంత ?
- Elisha Bonnke
- 6 days ago
- 1 min read
నెదర్లాండ్స్ దేశమునకు చెందిన కోరి టన్ బూమ్ అనే పరిచారకురాలు యొక్క జీవితంలో ఒక నూతన సంవత్సర సభలో జరిగిన నిజ సంఘటన ఇది.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె కుటుంబం... యూదులను రహస్యంగా రక్షించిన కారణంగా నాజీ జైలులో ఆమెను మరియు ఆమె అక్కను బంధించగా ఆకలి, అనారోగ్యం, దెబ్బలు, అవమానాలు అన్ని అనుభవించారు, అదే జైలులో ఆమె అక్క మరణించారు.
కోరి అనుకోకుండా జైలు నుండి విడుదలయ్యారు, యుద్ధ వాతావరణము తర్వాత ఆమె ప్రపంచమంతా తిరుగుతూ
దేవుని క్షమ, ప్రేమను గురించి సాక్షిగా కొనసాగుతున్న దినములలో ఒక నూతన సంవత్సర సభలో ప్రసంగమును అందించగా ప్రసంగం పూర్తయ్యాక
ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు.
ఆ వ్యక్తి కోరి గారు మరియు వారి సహోదరి హింసింపబడిన జైలులో పనిచేసిన ఒక గార్డు.
అతడే కోరిని మరియు ఆమె అక్కను తీవ్రంగా వేధించినవాడు.
ముందుకు వచ్చిన ఆ గార్డు చేతులు చాపి ఇలా అన్నాడు:
“నేను క్రీస్తును నమ్మి రక్షింపబడ్డాను, దేవుడు నన్ను క్షమించాడు, మీరు కూడా నన్ను క్షమించగలరా అని ?” ఈ మాటలతో అతను ఆమెను వేడుకొనగా...
ఆ క్షణం కోరి గారి గుండె వణికింది,
మనుష్యులుగా చూస్తే క్షమించలేని అపరాధము, మత్తయి సువార్త 6:15లో మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అన్నమాట ఇమె హృదయంలో గుర్తు చేసుకొని దేవుడే మిమ్మల్ని క్షమించినప్పుడు నేను ఎంత ? అని చెప్పి తన భావాలకు కాకుండా విశ్వాసానికి విధేయత చూపించారు.
ఆమె తన చేయి చాచి అతని చేయిని పట్టుకొని
ఆమె చెప్పిన మాటలు ఇవి:
“ఈ క్షణంలో నా హృదయంలో దేవుని ప్రేమ ప్రవాహములా వచ్చింది, ఈ క్షమాపణ నా బలము కాదు క్రీస్తులో మనకు అనుగ్రహింపబడిన బలము.”
ఈ నూతన సంవత్సరానికి మనకు ఇదే సందేశం అని బదులిచ్చారు.
మరి ఈ 2026వ సంవత్సరంలో అడుగుపెట్టిన మనము మొట్టమొదటగా జ్ఞాపకం చేసుకుంటున్నా మాట దేవుడు మనల్ని క్షమించారు, మనము కూడా ఇతరులను క్షమించాలి.
👉 గత సంవత్సర గాయాలు ఉన్నా
👉 మన్నించలేని అనుభవాలు ఉన్నా
👉 బాధ మిగిలిపోయినా
ఈ నూతన సంవత్సరాన్ని క్షమా గుణముతో ప్రారంభిద్దాము ప్రభువు యొక్క అత్యున్నతమైన కృపను పొందుకుందాం.
ఇది దేవుని పిల్లల విలువ అన్నది ప్రపంచానికి చాటుదాం.
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. 2కోరింథీ 5:17.
Elisha Bonnke



Comments