top of page

స్వస్థతను పొందుకున్న జీవితం

జాన్ న్యూటన్ (John Newton, 1725–1807)

జాన్ న్యూటన్ జీవితం ఒక గొప్ప ఆత్మీయ స్వస్థత (inner healing) కు చరిత్రలో నిలిచిన సాక్ష్యం.


జాన్ న్యూటన్ చిన్నతనంలోనే తల్లి మరణించడం, తండ్రి ఒక సముద్ర నావికుడు కావడం వలన తన జీవితమునకు అదుపు లేకుండా పోయింది.

యువకుడిగా బానిసల వ్యాపార నౌకలో కెప్టెన్ గా ఉంటూ మద్యం, వ్యసనాలు హింస, అహంకారం వంటి జీవన శైలితో దేవునిపై విశ్వాసం లేని జీవితమును కలిగియున్నారు.

అతని జీవితం నైతికంగా, ఆత్మీయంగా పూర్తిగా విరిగిపోయింది

అయితే ఒక రోజు మలుపు తెచ్చిన సంఘటన 1748లో తన జీవితంలో జరిగింది, సముద్ర ప్రయాణంలో భయంకరమైన తుఫాను ఎదురైంది, ఇక మరణం ఎదురుగా ఉన్న ఆ క్షణంలో న్యూటన్ మొదటిసారి దేవుని సహాయం కోసం ప్రార్థించాడు. ఆ అనుభవమే అతని జీవితాన్ని మార్చింది, ఇది ఆత్మీయ స్వస్థత ప్రారంభ బిందువు.

స్వస్థత తరువాత జీవితం

బానిస వ్యాపారాన్ని పూర్తిగా వదిలివేశాడు

యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి పాస్టర్‌గా మారి అనేక మందికి మార్గదర్శకుడయ్యారు.

బానిసత్వానికి వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్రను వహించారు.


“Amazing grace, how sweet the sound,

That saved a wretch like me…” అనే గీతమును రచించి అతని పూర్వజీవితం నుండి పొందిన సంపూర్ణ స్వస్థతకు సాక్ష్యమును ప్రతిభంభించారు.


ఈ సంఘటన మనకు చెప్పేది

స్వస్థత అనేది శరీరానికే కాదు, మనస్సు, హృదయం, ఆత్మకు కూడా అవసరం.

ఎఃత పతనములో ఉన్నా దేవుని కృప జీవితమును మార్చగలదు, నిజమైన మార్పు వచ్చినప్పుడు ఆ జీవితము చరిత్రపై ప్రభావం చూపుతుంది. జాన్ న్యూటన్ జీవితం ఒక చరిత్ర.

ఒక మాటలో జాన్ న్యూటన్ జీవితం పాప జీవితం నుండి కృపా జీవితం వైపు సంపూర్ణ స్వస్థత పొందిన నిజ చరిత్ర‌.


ఈ నూతన సంవత్సరములో గతించిన దినములలో ఉన్న రోగములు, ఆత్మీయ రోగము, అహంకార రోగం, స్వార్థ రోగం, వేషధారణ రోగము, స్వనీతి రోగముల నుండి విడుదల నిచ్చే యేసు వైపు చూస్తూ మన ముందున్న నూతన సంవత్సర ప్రయాణంలో.. అద్భుతమైన స్వస్థత పొందుకున్నవారముగా సాగిపోదాము...


ఆత్మీయ స్వస్థత పొందుకున్న జీవితం ఏమిటో ప్రపంచమునకు చూపించుదాం..


కీర్తనలు 147:3

గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.


యెహేజ్కేలు 36:26

నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page