top of page

వాక్య సమృద్ధి కలిగినవారు - లోకానికి వెలుగు

చరిత్రలో వాక్య సమృద్ధిని పొందుకున్నవారు వాక్యం యొక్క విశిష్టతను ఎంత గొప్పగా ఎంచారో చూద్దామా...


1️⃣ మార్టిన్ లూథర్ (1483–1546)

మొదటలో మార్టిన్ లూథర్ భయం, అపరాధ భావంతో జీవించేవారు.

అయితే రోమా పత్రిక 1:17 “నీతిమంతుడు విశ్వాసమువలన జీవించును” అన్న వాక్యం అతని జీవితాన్ని మార్చేసింది.

వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం వలన

రక్షణ సత్యాన్ని గ్రహించారు.

సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు, బైబిల్‌ను సామాన్య భాషలోకి తెచ్చిన దైవజనుడు మార్టిన్ లూథర్.


👉 వాక్యం కొరకు అతను ఇచ్చిన సాక్ష్యము

“సంఘాన్ని నిలబెట్టింది దేవుని వాక్యమే, నేను కాదు"


2️⃣ సాధు సుందర్ సింగ్ (1889–1929)

భారతదేశంలో పుట్టిన సుందర్ సింగ్ మొదటలో క్రైస్తవులను ద్వేషించేవారు.

సాధు సుందర్ సింగ్ యేసును పొందుకున్న తర్వాత బైబిల్‌ను తన జీవిత ఆహారంగా మార్చుకున్నారు.

ఈ వాక్య సమృద్ధిని బట్టి హిమాలయాల్లో సువార్తను అందించి హింసలలో, చెరసాల అనుభావలలో, కష్టాలలో వాక్యమే బలముగా ముందుకు సాగిన దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు.


👉 వాక్యం కొరకు అతను ఇచ్చిన సాక్ష్యము

“బైబిల్ నా శరీరానికి కాదు, నా ఆత్మకు ఆహారం”


3️⃣ పండిత రమాబాయి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అనేక వేల శ్లోకాలు నేర్చుకొని పండిత అనే బిరుదును పొందుకున్న ఆమె జీవితంలో అనేకమైన దుఃఖ పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాయి, అందులో ప్రాముఖ్యమైనది భర్తను కోల్పోవడం.

అయితే వాక్యమును పొందుకున్న ఆమె బైబిల్‌ను నిత్య ధ్యానం చేయడం ద్వారా పొందుకున్న అంతరంగ బలముతో

వేలాది మహిళల సామర్ధ్యతను పెంపొందించే ఉద్యమమును తీసుకొచ్చారు మరియు బైబిల్ అనువాద సేవలు అందించారు.


👉 వాక్యం కొరకు ఆమె ఇచ్చిన సాక్ష్యము

“వాక్యమే నన్ను నిలబెట్టింది; పరిస్థితులు కాదు.”


4️⃣ జాన్ బన్యన్ (1628–1688)

చెరసాలలో 12 సంవత్సరాల జీవితములో బైబిల్ తప్ప ఇంకేమీ లేదు, తన బంధకాలలో ఉన్న వాక్యసమృద్ధిని బట్టి వచ్చిన ఫలితం యాత్రికుని ప్రయాణం అనే ప్రపంచ ప్రసిద్ధ క్రైస్తవ పుస్తకం.


👉 వాక్యం కొరకు అతను ఇచ్చిన సాక్ష్యము

“బైబిల్ నాకు స్వేచ్ఛను ఇచ్చిన ప్రపంచము”


5️⃣ చార్ల్స్ స్పర్జన్ (1834–1892)

చిన్న వయసులోనే తీవ్ర నిరాశలతో వెళ్లిన అతని జీవితంలో “యెషయా 45:22

భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి'' అన్న ఈ వాక్యమును దేవుని వైపు చూసే బలమును అనుగ్రహించింది. వాక్యంతో నిండిన ఆయన జీవితం వేల సందేశాలతో

కోట్లాది మంది జీవితాలను ప్రభావితము చేసారు.


👉 వాక్యం కొరకు అతను ఇచ్చిన సాక్ష్యము

“బైబిల్ నా రక్తంలో ప్రవహిస్తుంది.”


అవును దేవుని వాక్యం బలహీనుడైన మనుష్యుని చరిత్రను మార్చే వ్యక్తిగా చేస్తుంది.


ఇలా అనేకమంది జీవితాలను వెలిగించిన దేవుని వాక్యము ఈ నూతన సంవత్సరములో ఈ మాటలు చదువుతున్న మనలను కూడా ప్రభావితము చేయగలదు.


నూతన సంవత్సరంలో ఈ క్రింది వాక్యమును మనము కూడా తీసుకుందామా...


సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి..”

(కొలస్సీ 3:16)


వాక్య సమృద్ధిని పొందుకుందాం, క్రైస్తవ విలువను లోకమునకు చాటుదాం.


- Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page