top of page

నీవేతే ఏం చేస్తావు

చరిత్రలో డిట్రిచ్ బోన్‌హోఫర్ గారి (Dietrich Bonhoeffer )సరైన నిర్ణయ నిజచరిత్ర ఇది.

హిట్లర్ పాలనలో నాజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యం వైపు నిలిచిన దేవుని సేవకుడు డిట్రిచ్ బోన్‌హోఫర్ గారు. క్లిష్ట పరిస్థితుల్లో హిట్లర్ పాలనలో చాలామంది పాస్టర్లు భయంతో మౌనంగా ఉన్న సమయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకొని “క్రీస్తుకు విధేయత – రాజ్యానికి విధేయతకన్నా పై స్థానము కలది” అని నిలవబడిన సేవకుడు. అటువంటి సమయంలో ఆయన అమెరికాలో సురక్షితంగా ఉండే అవకాశం వచ్చింది, కానీ ఆయన ఇలా అన్నారు “నా దేశం బాధపడుతుంటే, నేను సురక్షితంగా ఉండలేను” అని. హిట్లర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం ఆయనను జైలుకు తీసుకెళ్లింది.

జైలులో ఉన్నా ఆయన ఖైదీలను ప్రార్థనలో ప్రోత్సాహపరచి అనేకమందినకి లేఖల వ్రాస్తూ తన లేఖల ద్వారా విశ్వాసమును బలపరిచారు, Letters and Papers from Prison అనే ప్రసిద్ధ రచనను వెలువరించారు, చరిత్రలో దేవుని మహిమ పాత్రగా వెలుగొందారు.


ఈ సమయంలో మనము ఒక ప్రశ్న వేసుకుందాం


నీవైతే ఏం చేస్తావు?


పరిశుద్ధ గ్రంథంలో...

సౌలు చేత దావీదు నిష్కారణముగా తరమబడుతున్నాడు

దావీదుకు దేవుని నుండి మరియు ప్రజల నుండి సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ సౌలు దగ్గర నుండి పారిపోతున్నాడు

సింహములను, ఎలుగులను, సౌలు ఓడించలేని గొల్యాతు వంటి వ్యక్తులను ఎదుర్కొనే శక్తి ఉన్నప్పటికీ సౌలు నుండి పారిపోతున్నాడు

పారిపోతున్న దావీదు ఒకరోజు తన మనుష్యులతో కూడా ఒక గుహలో ఉండగా అదే గుహలోనికి సౌలు ఒంటరిగా వచ్చినప్పుడు, అందరూ సౌలును చంపేయమన్నారు, కానీ దావీదు అలా చేయాలనుకోలేదు


అదే స్థానంలో మనముంటే ఏం చేస్తాం ?


దావీదు తన్ను తాను అదుపు చేసుకోవడానికి గల ముఖ్య కారణము, మొదటగా సౌలు ఇశ్రాయేలీయుడు రెండవదిగా అభిషేకింపబడినవాడు మూడవదిగా నాయకుడు.


ప్రస్తుత తోడి సహోదరులకు మనము ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి ?

అభిషేకింపబడిన వారు మన దృష్టిలో ఏ విధముగా ఉన్నారు ?

మన పైన నాయకులుగా ఉన్నవారి పట్ల వ్యవహరిస్తున్న తీరు ఏమిటి ?


సంఘాలలో చాలా గందరగోళాములకు కారణము వ్యక్తిగత అభిప్రాయాలతో పరిస్థితులను ఎదుర్కోవడం.

వాక్య క్రమమును అనుసరించి దైవ చిత్తానుసారముగా పరిస్థితులను మనం ఎదుర్కోవాలి


దేవుని చిత్తానుసారముగా శ్రమ పడినది మేలుకరమైనదే..

1పేతురు 3:17

దేవుని చిత్త మాలాగున్నయెడల కీడు చేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.


అనేకమంది మనకు మాదిరిగా ఉన్నారు, మరి మనము కూడా కష్టమైన, నష్టమైన వాక్య క్రమమును అనుసరించి దైవ చిత్తానుసారముగా ముందుకు సాగిపోదాం.


God bless you all


- Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page