మనమెంతో బలవంతులము
- Elisha Bonnke
- Nov 9, 2024
- 2 min read
ఒకసారి గూగుల్ CEO అయిన
సుందర్ పిచాయ్ గారు
ఒక హోటలుకు వెళ్ళినప్పుడు అక్కడ చూసిన పరిస్థితిని ఒక ఉపన్యాసంలో పంచుకున్నారు.
అక్కడ ఎదుట ఇద్దరు స్త్రీలు కుర్చున్నారట, ఇంతలో ఒక బొద్దింక వారిలో ఒకామె మీద పడగానే ఆమె భయముతో అసహ్యముతో కేకలు వేసి ఆ బొద్దింకను దులిపిన వెంటనే రెండవ ఆమె మీద అది పడింది ఆమె కుడా ఒంటి జలదరింపుతో వణికి దానిని విసిరేసింది.
ఇంతలో ఆ హోటలులో పని చేస్తున్న వెయిటర్ వచ్చి ఆ బొద్దింకను తీసుకొని బయట పడేసడట.
గూగుల్ CEO సుందర్ గారు జరిగిన ఈ సంధర్బమును భట్టి ఒక ఉపన్యాసము ఇస్తూ ఒక బొద్దింకను ఇద్దరు స్త్రీలు ఒకలా చూసారు అదే బొద్దింకను అక్కడ పని చేస్తున్న వెయిటర్ ఇంకోలా చూసారు.
పరిస్థితిని మనము చుసే విధానములోనే పరిస్థితి మీద అధికారమును వహించగలము.
మన ఆలోచనలో మార్పు రావాలి వెయిటర్ దగ్గర బొద్దింక ఎంత బలహీనమో ఆ స్త్రీల దగ్గర కుడా అంతే బలహీనము అని ఆయన ఇచ్చిన ఉపన్యాసములో పంచుకున్నారు.
ఈ సంఘటనలో ఉన్న భావమును జ్ఞాపకం చేసుకుందాం, బొద్దింక కన్నా నాకు ఉన్న శక్తి చాలా ఎక్కువ అని గుర్తించగలిగినప్పుడు సుళువుగా ఆ బొద్దింకను తీసిపడవేయగలము.
సంఖ్యాకాండం 13వ అధ్యాయములో కానానును వేగుచూచుటకు పంపబడిన 12 మంది మనుష్యులలో పదిమంది అక్కడ ఉన్న పరిస్థితిని ఒకలా చూసారు.
సంఖ్యాకాండము 13:31 - 33
అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.
మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.
అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ యులను చూచితిమి; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.
దీనికి విరోధముగ యెహోషువ కాలేబులు మరోలా చూసారు.
సంఖ్యాకాండము 13:30
కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
సంఖ్యాకాండము 14:9
...ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి.
గుర్తుంచుకుందాము మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు.
మనలో ఉన్న బలము ఈ లోకములో ఉన్న బలము కన్నా గొప్పది.
దీనిని గుర్తించగలిగినప్పుడు దీనిలో స్థిరంగా ఉండగలిగినప్పుడు ఏ పరిస్థితి కూడా మనలను ప్రభావితం చేయలేదు, పరిస్థితులనే మనము ప్రభావితము చేయగలము.
-Elisha Bonnke


Comments