top of page

బానిస బానిసగా అమ్మిన వ్యక్తిని ?

కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్రికా దేశంలో జరిగిన సంఘటన ఇది. కొన్ని దేశాలలో మనుష్యులను బానిసలుగా అమ్మె సంప్రదాయం ఉంటుంది కదా.

దీనిలో భాగంగా ఆఫ్రికా దేశంలో ఒక వ్యక్తి 12 సంవత్సరాల బాలుడును బానిసగా కొనుకున్నాడు.

ఆ బాలుడు యేసుక్రీస్తు నందు విశ్వాసముతో యోగ్య ప్రవర్తన కలిగిన వాడు.

గనుక కొన్ని దినములకే తన యజమానికి ఆ బాలుని మీద దయ కలిగి ఆ బాలుని ఒక దాసునిగా కాకుండా తన కుటుంబ సభ్యులలో ఒకనిగా భావించాడు.

ఆ బాలునికి 24 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు ఆ యజమానుడు ఆ బాలునితో మనము సంతకు వెళ్లి మరొక బానిసను కొందాము రమ్మని చెప్పి ఇద్దరూ సంతకు వెళ్లారు.

ఆ సంతలో రకరకాల మనుష్యులు ఉండగా ఈ బాలుని దృష్టిలో వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వృద్ధుని కొందాము అని యజమానునితో చెప్పగా. వృద్ధాప్యంలో ఉన్న ఈ వ్యక్తి మనకు దేనికి ఉపయోగపడతాడు ? వద్దని చెప్పగా ఆ బాలుడు తన యజమానుని బ్రతిమలాడి ఆ వృద్ధుడిని కొందామని వేడుకొనగా, ఆ బాలుని పట్టుదల బట్టి ఆ యజమానుడు ఆ వృద్ధుని కొన్నాడు.

కొనబడినటువంటి ఆ వృద్ధుని ఈ బాలుడు ఒక తండ్రిలా చూసుకుంటూ తనకు కావలసినవన్ని సమకూరుస్తూ పరిచర్య చేస్తూ ఉండగా అది గమనించిన ఆ యజమానుడు ఈ వృద్ధుడు నీ తండ్రా అని అడిగినప్పుడు ఆ బాలుడు కాదని చెప్పగా, లేదు ఇతడు నీకు సంబంధించిన వాడే అందుకే నీవు ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు చెప్పినప్పుడు, ఆ బాలుడు ఈ వృద్ధుడు 12 సంవత్సరముల క్రితం నన్ను మా తల్లితండ్రుల దగ్గర నుండి కిడ్నాప్ చేసి బానిస సంతలో పెట్టి నన్ను ఈ విధంగా అమ్మివేసాడు అని చెప్పగా మరి నిన్ను బాధ పెట్టిన ఈ వ్యక్తిని ఇంత ప్రేమగా చూసుకుంటున్నావేమని అడుగగా, నేను సేవిస్తున్న క్రీస్తు శత్రువులను ప్రేమించమన్నారు, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నారు, ఆయనలా ఇతరులను ప్రేమించమన్నారు గనుక నేను ప్రభువు ఆజ్ఞను నెరవేరుస్తున్నాను అని ఆ బాలుడు బదులిచ్చాడు.


దేవునికి మహిమ కలుగును గాక! ఇటువంటి సాక్ష్యములు మరియు యేసు క్రీస్తు ప్రభువు శత్రువుల కొరకు చేసిన ప్రార్థన మనకు అందరికీ పరిచయమైనప్పటికీ చాలామంది శత్రువులను ప్రేమించుటలో ఓడిపోతున్నారు.


లోకమంతా పోవుచున్నట్టుగా మనము వెళ్లకూడదని దేవుడు కోరుకుంటున్నారు, మనలను ప్రేమించిన వారినే మనము ప్రేమిస్తే మనకేమీ ప్రతిఫలము సుంకరులును పాపులును అలాగే చేస్తున్నారు కదా అని యేసయ్య చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాము.


రోమ 12:20, 21

కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.


Elisha Bonnke

 
 
 

Recent Posts

See All

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page