ప్రభువు మార్గమును సిద్దపరుచుడి..
- Elisha Bonnke
- Nov 22, 2024
- 1 min read
ఈ లోకములో ఘనులుగా పిలవబడినవారు, రాజులుగా ఉన్నవారు ఎదైనా ప్రాంతములకు వస్తున్నారు అని తెలియగానే అశుభ్రత అంత తొలగించి మార్గములను సిద్ధం చేస్తారు. ఒకసారి వైజాగులో ఒక రోజు సాయింత్రం ఒక మర్గములో వెళుతుండగా ఆ రహదారి చాలా భయంకరముగా అనిపించింది, రెండవ రోజు అదే మార్గమున వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆశ్చర్యము మునుపటి దినమున ఉన్న అశుభ్రత అక్కడ లేదు, చాల సుందరముగా ఆ రహదారి రూపు దిద్దుకుంది.
కారణము ఆనాటి ఇండియా రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారు వైజగ్ పర్యటన ఉండడమే.
మరి దేవది దేవుడైన ప్రభువు మన పరిస్థితులలో సంచరించాలి అంటే మనము ఆయనకు తగిన విధముగా మార్గములను సిద్ధపరచాలి కదా.
యెషయా40:3,4
ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను.
ప్రభువు మార్గములను సిద్ధపరచుటకు బాప్తిస్మమిచ్చు యోహానుకై ఇవ్వబడిన ఈ ప్రవచనములో ప్రతీ పర్వతము కొండ అణచవలెను ప్రతీ లోయ ఎత్తు చేయవలెను అన్న మాట ప్రకారము మనలో ఉన్న హెచ్చించుకునే స్వభావముగల కొండలు అణచబడినప్పుడు, మన బలహీనతలతో దిగజారిపోయి పడిపోయిన లోయలు పూడ్చబడినప్పుడు, ప్రభువు సంచరించగలిగే మార్గములు మనమే కాగలము.
అట్టి కృపలో మనమందరము వర్థిల్లాలని ఆశీస్తూ..
Elisha Bonnke



Comments