నేను దూడను కాను కారును...
- Elisha Bonnke
- Nov 13, 2024
- 1 min read
ఒక చిన్న కథలో నుండి ఒక సత్యమును గమనిద్దాం.
ప్రసవించడానికి సిద్ధముగా ఉన్న ఒక ఆవు రోడ్డుమీద ఉండగా కార్ గ్యారేజ్ కలిగి ఉన్న ఒక యజమాని దానిని చూసి అది ప్రసవించుటకు సరైన స్థలము లేదని భావించి తన కారు గ్యారేజ్ లో ఒక స్థలములో ఉంచగా కొంత సమయమునకు ఆ ఆవు ప్రసవించింది.
కార్ గ్యారేజ్ లో పుట్టడం వలన తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన దూడ సంతోషంతో నేను కారును, నేను కారును అని అందరితో చెప్పుకుంటుందట.
ఈ కథను అనుసరించి మన క్రైస్తవ్యములో ఉన్న ఒక లోటును గమనిద్దాం.
చాలామంది క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారు నేను క్రైస్తవుడను క్రైస్తవుడను అని చెప్పుకోవడము పరిపాటి అయిపోయింది, క్రైస్తవ కుటుంబములో పుట్టినంత మాత్రాన క్రైస్తవులము కాలేము అన్న సత్యమును జ్ఞాపకం చేసుకుందాం.
క్రీస్తును గూర్చిన సువార్త వినబడాలి, వినిన సువార్తకు తగిన ప్రతిస్పందన కనిపించాలి, ఆ స్పందనలో విశ్వాసము ద్వారా ప్రభువు ఇచ్చే రక్షణ భాగ్యమును మారుమనస్సు అనే ఫలము ద్వారా బాప్తిస్మము అనే సాక్ష్యం ద్వారా పొందుకోవాలి, వారే క్రైస్తవులనబడుదురు.
పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలవబడిన వారిని గూర్చిన ప్రస్తావన జ్ఞాపకం చేసుకుందాం.
అపో.కా 11:26
మొట్ట మొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.
అపోస్తుల బోధించిన బోధను అంగీకరించిన అంతియొకయ శిష్యులు క్రైస్తవులుగా పిలువబడిరి.
వారసత్వము కాదు క్రైస్తవ్యం, పారంపర్యాచారము కాదు క్రైస్తవ్యము, మనుష్యులను అనుకరించేది క్రైస్తవ్యం కాదు, మన సొంత భక్తి విధానాలు కాదు క్రైస్తవ్యం కాదు.
క్రీస్తు బోధను అనుకరించడమే క్రైస్తవ్యం.
పుట్టుక క్రైస్తవ్యం, నామకార్థ క్రైస్తవ్యం, ఆచార క్రైస్తవ్యం అన్నదానికి దేవుని సంఘములో చోటు లేదు.
చివరగా ఒక ప్రశ్న..
మనము దేవుడు అనుకున్నట్టుగా ఉన్న క్రైస్తవులమేనా ?
Elisha Bonnke.


Comments