దేవుడు నీకు ఇచ్చిన విలువను ఆపుతరం ఎవరి తరము కాదు
- Elisha Bonnke
- Nov 13, 2024
- 1 min read
ఒక చర్చిలో పాత వస్తువులన్నిటిని వేలం వేస్తున్నారు, అందులో కుర్చీలు, టేబుల్స్, కీబోర్డ్ వంటివి ఉన్నాయి. వాటిలో ఒక పాత వయోలిన్ కూడ ఉంది. అక్కడ ఉన్నవన్నీ వేలంలో మంచి ధరకు వెళ్లాయి గాని పాత వయొలిన్ ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలేదు, ఎంత తక్కువ ధరతో దాని వెలను ప్రారంభించిన ఎవరు ముందుకు రాలేదు. ఇంతలో ఒక వృద్దుడు ముందుకు వచ్చి ఈ వయొలిన్నీ నేనే తయారుచేసాను, చాలా సంవత్సరముల క్రితము దీనిని చర్చికు బహుకరించాను, చర్చిలో ఇంతకుముందు చాలా బాగా ఉపయోగపడింది అని చెప్పి ఆ వయొలిన్ ను సరిచేసి, ఒక చక్కని పాటను వినిపించారు. అది విన్న ఆ సమూహము అప్పటివరకు కనీస ధర పలకని ఆ వాయిద్యమును అధిక మొత్తములో కొనుకొనుటకు పోటీపడ్డారు.
ఒకప్పుడు మనలను వాడుకున్నవారు, ఒకప్పుడు మనలను కోరినవారు, ఒకప్పుడు మనకు విలువనిచ్చినవారు, మన వలన సహాయము పొందుకున్న వారు ఇప్పుడు మన అవసరత లేనప్పుడు మన అవసరత తీరినప్పుడు మనలను తక్కువగా చూసి మనలను హేళనగా ఎంచితే గుర్తుంచుకుందాము, ఏ విలువతో అయితే దేవుడు మనలను పిలుచుకున్నారో అదే విలువతో మనలను చూచుచున్న దేవుడు మన విలువను అంతము వరకు నిలుపును, మన విలువను ట్యూన్ (పునరుద్దించగలిగే) చేయగలిగే మన దేవుడు మనలను పిలుచుకున్న మన దేవుడు మనకు ఉన్నారు. మరొక్కసారి దేవుడు మనలను సరిచేసి వదిలితే మనలను ఆపుతరము ఎవరి తరము కాదు.
న్యాయాధిపతులు 11:1గిలాదువాడైన యెఫ్తా పరాక్రమముగల బలాఢ్యుడు. ఈ పరాక్రమ బలాఢ్యుని తన ఇంటి వారే తరిమివేసారు. అక్కడనుండి టోబు దేశమునకు పారిపోగా అల్లరిజనము అతనితో సంచరించుచు అతనిని కృంగదీసారు.
న్యాయాధిపతులు 11:3యెఫ్తా తన సహోదరులయొద్దనుండి పారిపోయి టోబు దేశమున నివ సింపగా అల్లరిజనము యెఫ్తాయొద్దకు వచ్చి అతనితో కూడ సంచరించుచుండెను.
అలాంటి పరిస్థితుల్లో యెఫ్తా యొక్క అవసరము ఉన్నది అన్నట్టుగా దేవుడు ట్యూన్ చేసాడు. తదనంతరం తరిమి వేసిన వారే తమ మీద అధిపతిగా ఉండమని పిలుపునిచ్చారు.
న్యాయాధిపతులు 11: 4 - 6కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీ యులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రా యేలీయులతో యుద్ధము చేసినందున, గిలాదు పెద్దలు టోబుదేశమునుండి యెఫ్తాను రప్పించుటకు పోయినీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి.
మనుష్యులు మనలను తక్కువ చేస్తే దేవుడు నిర్మించిన రూపము తక్కువ కాదు, తక్కువ కాలేదు.
1పేతురు 5: 5దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
Elisha Bonnke


Comments