దోచుకొనబడినప్పటికీ
- Elisha Bonnke
- Nov 3, 2024
- 1 min read
Updated: Nov 4, 2024
మాథ్యూ హెన్రీ 1662 నుండి 1714 వరకు జీవించిన సుప్రసిద్ధ బ్రిటిష్ బైబిల్ పండితుడు మరియు బోధకుడు, పాత మరియు కొత్త నిబంధనపై అతని వ్యాఖ్యానాలు నేటికీ ముద్రణలో ఉన్నాయి.
ఒకరోజు డా. హెన్రీ తన గుర్రంపై అతిథి వక్తగా ఒక చర్చి సమావేశానికి వెళుతున్నారు. అతను దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తుండగా ఒక ముసుగు బందిపోటుదొంగ తుపాకీతో అకస్మాత్తుగా ఎదురై హెన్రీని దిగి తన డబ్బు మొత్తాన్ని అప్పగించాలని డిమాండ్ చేసాడు.
ప్రాణ భయంతో డా. హెన్రీ తన దగ్గర ఉన్న మొత్తం సొమ్మును ఆ బందిపోటు దొంగకు అప్పగించారు, ఆ సొమ్మును దోచుకొని ఆ దొంగ హెన్రీని విడిచి పెట్టాడు.
అక్కడ నుండి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు "అన్ని పరిస్థితులలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమనే" దేవుని ఆజ్ఞ గురించి ఆలోచించాడు.
డబ్బులు లేని పరిస్థితుల్లో మరియు అన్యాయముగా దోచుకొనబడినప్పుడు మీరు ఎలా కృతజ్ఞతలు తెలుపుతారు అన్న ప్రశ్నకు జవాబును పొందుకున్నాడు.
తాను ప్రతికూల పరిస్థితుల్లో ఎలా కృతజ్ఞతతో ఉండగలిగాడో చెప్పడం ద్వారా ఆ రాత్రి మాథ్యూ హెన్రీ తన సందేశాన్ని ముగించాడు.
ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ఇచ్చే కృతజ్ఞతను ఈ విధముగా ప్రభువుకు చెల్లించాడు...
అందులో మొదటగా..
"నేను ఇంతకు ముందెన్నడూ ఈ విధముగా దోచుకోబడలేదు" దానినిబట్టి ప్రభువుకు కృతజ్ఞుడను.
రెండవదిగా...
అతను నా డబ్బు మాత్రమే తీసుకున్నాడు నన్ను చంపనందుకు కృతజ్ఞుడను.
మూడవదిగా...
అతను కొంత డబ్బు మాత్రమే తీసుకొని నా గుర్రమును నా వస్త్రములను తీసికోలేదు దానికి నేను కృతజ్ఞుడను.
నాలుగవదిగా...
ముఖ్యంగా, నేను దోచుకున్న వ్యక్తిని మరియు దొంగను కానందుకు నేను కృతజ్ఞుడను!
దేవునికి మహిమ కలుగును గాక!
హెన్రీ గారు కనుపరిచిన ఈ కృతజ్ఞతలో ఉన్న సత్యమును గమనించుదాం.
కొన్ని పరిస్థితులు ద్వారా మనము పట్టబడినప్పుడు, ఓడిపోయినప్పుడు, నలిగిపోతున్నప్పుడు మనము కలిగియున్న శేషమును గూర్చి ప్రభువుకు కృతజ్ఞత చెల్లించే అంత విశ్వాసము మనకు ఉన్నదా ?
ఇట్టి విశ్వాసం మనలో ఉంటే ఏ పరిస్థితి కూడమనలను ప్రభువు నుండి దూరపరచ లేదు.
ఇట్టి ధన్యతలో మన విశ్వాసము వర్ధిల్లాలి అని ఆశపడుదాం
God bless you
Bro Elisha Bonnke


Praise the lord..