దేవునికృపతోనే
- Elisha Bonnke
- 17 hours ago
- 1 min read
కృప, అర్హతల మీద ఆధారపడనిది
కృప, బలహీనతలలో బలమును ఇచ్చేది
కృప, అంధకారములో వెలుగును నింపేది
కృప, భయాలలో ధైర్యమును ఇచ్చేది
👉 మనకందరికీ పరిచయమున్న దైవజనుని జీవితము నుండి దేవుని కృపను జ్ఞాపకం చేసుకుందాం
నిక్ వుజిసిక్ (Nick Vujicic) ప్రపంచమంతా పరిచయమున్న దైవజనుడు.
ఆస్ట్రేలియాలో జన్మించిన నిక్ గారికి చేతులు లేవు, కాళ్లు లేవు.
పుట్టినప్పుడే డాక్టర్లు చెప్పారు “ఈ పిల్లవాడు సాధారణ జీవితం గడపలేడని.”
తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచినా, సమాజం అతన్ని అంగీకరించలేదు.
నిరాశలో కూరుకుపోయిన బాల్యం కారణం తన తోడి పిల్లలు అతన్ని చూసి నవ్వడం.
స్కూల్‌లో వేధింపులు, ఒంటరితనం, విలువ లేనివాడిననే భావన.
కేవలం 10 సంవత్సరాల వయసులో నిక్ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించిన పరిస్థితి.
దేవునితో “దేవుడా… నన్ను ఇలా ఎందుకు సృష్టించావు?” అనే ఒక ప్రశ్నతో దినములు ముందుకు వెళుతున్నాయి.
అయితే, ఒకరోజు దేవుని కృప అతని జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిన రోజు అయింది.
ఆ రోజు బైబిల్ చదువుతుండగా ఈ వాక్యం అతన్ని కదిలించింది “నా కృప నీకు చాలును.”2 కోరింథీ 12:9.
ఆ క్షణంలో అతనికి అర్థమైంది
👉 దేవుడు తప్పు చేయలేదు, దేవుడు తప్పు చేయరు కూడా
👉 శరీరం బలము కాదు, లోటు లేని దేవుని కృపే అతని బలమని.
నిక్ ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు
“ప్రభువా, నా బలహీనతను
నీ మహిమకు ఉపయోగించు అని”
అద్భుతమైన దేవుని కృప, బలహీనతలను ఓడించే బలమైన దేవుని కృప
ఈ రోజు నిక్ గారిని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మధ్య సాక్షిగా నిలబెట్టారు.
స్కూళ్ళలో, కాలేజీలలో, దేశాలలో తిరుగుతూ, నిరాశలో ఉన్నవారికి ఆశను దేవుని కృపలో అందిస్తున్నారు.
నిక్ గారు ప్రపంచానికి అందించిన సత్యం
“నాకు చేతులు కాళ్లు లేవు,
కానీ నాకు దేవుని కృప ఉంది అది నాకు సరిపోతుంది.”
ఈ లోకములో బలము, ఘనము, ధనము, ఆరోగ్యం, కనిపించే ప్రతి దృశ్యం అంతరిస్తాయి కానీ అదృశ్యుడైన దేవుని కృప నిరంతరముండును.
అంతరించిపోయేది మన దగ్గర లేకపోయినా పర్వాలేదు, నిరంతరం ఉండేది మనకుంటే చాలు. "అది దేవుని కృపయే."
ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను 1:16
2025 వ సంవత్సరం వరకు మనల్ని వెంబడించిన గొప్ప 2026వ సంవత్సరములో కూడా మనతో ఉన్న దేవుని కృప ఘనపరచబడును గాక.
దేవుని కృపను వేడుకుందాం
రోమ 10:12, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.
హెబ్రీ 13:25
కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్.
-Elisha Bonnke



Comments