top of page

ఆరాధన జీవీతము

ఆరాధన అంటే పాటలు, సంగీతము, సమూహముగా చేసే ఆరాధన మాత్రమే కాదు, ఆరాధన అంటే జీవితమంతా దేవునికి అర్పించడమే.


ముందుగా, క్రైస్తవ చరిత్రలో ఆరాధన జీవితం (Worship Life) నిజంగా జీవించి చూపించిన వ్యక్తుల నిజమైన చారిత్రాత్మక వివరాలు గమనిద్దాం.


👉 మార్టిన్ లూథర్ (Martin Luther – 1483–1546)

మార్టిన్ లూథర్ గారి దినచర్య ప్రార్థన లేకుండా ప్రారంభము కాదు.

“నాకు ఈ రోజు పని ఎక్కువగా ఉంది గనుక నేను ఈ రోజు ఇంకా ఎక్కువగా ప్రార్థిస్తాను” అని దేవునితో ఉన్న సహవాసము ఎంత విలువైందో చెప్పిన దైవజనుడు.

ఈ భావన కలిగిన మార్టిన్ లూథర్ గారు అనేకమైన పాటలను సంఘ ఆరాధనలో ప్రవేశపెట్టారు.

1, A Mighty Fortress Is Our God

2, From Heaven Above to Earth I Come

3, Come, Holy Ghost, God and Lord

ఇలాంటి పాటలు తన ఆరాధన జీవితం నుండి జర్మనీ భాషలో లూథర్ గారు రచించారు, అవి ఇంగ్లీషులో మరియు ఆయా భాషలలో తర్జుమా చేయబడి ఇప్పటికీ చాలా సంఘాలలో పాడుతున్నారు.

ఈ పాటల యొక్క ఉనికి ఒక ఆరాధన జీవితం నుండి వచ్చినవి.

ఆరాధన అన్నది జీవిత విధానం అని చూపించారు మార్టిన్ లూథర్ గారు.


👉 జాన్ వెస్లీ (John Wesley – 1703–1791)

జాన్ వెస్లీ గారు రోజుకు ఉదయం 4 గంటలకే లేచి ప్రార్థన మొదలు పెట్టేవారు.

సంవత్సరానికి 250,000 కి.మీ. ప్రయాణించి సువార్త ప్రకటించారు.

క్రమబద్ధమైన సంఘ జీవితమును నేర్పించిన దైవజకుడు.

నామకార్ధ క్రైస్తవ విధానాలలో మార్పులు తీసుకొచ్చారు, ప్రజల వద్దకు సువార్తను తీసుకెళ్లడంలో ఉజ్జివమును తీసుకొచ్చారు,

పరిశుద్ధత ప్రాముఖ్యమైనది అని తన ఆరాధన జీవితం నుండి సంఘమునకు నేర్పించారు.


👉 బ్రదర్ లారెన్స్ (Brother Lawrence – 1614–1691)

వంటగదిలో పని చేస్తూనే దేవునితో సంభాషణలో ఉండేవారు.

దేవుని సన్నిధిని ఎంతగా అనుభవించారో ఆయన రచించిన The Practice of the Presence of God అనే పుస్తకములో గమనించవచ్చు. “ప్రార్థన అంటే మందిరములో మాత్రమే కాదు, ప్రతి క్షణం దేవునితో ఉండడం” అని తాను జీవించిన జీవితము నుండి తెలియజేసిరు బ్రదర్ లారెన్స్ గారు.


👉 వాచ్‌మాన్ నీ (Watchman Nee – 1903–1972)

చైనా జైలులో 20 సంవత్సరాలు ఉన్నా ప్రార్థన చేయడము ఆపలేదు.

సంఘ ఆరాధనలో ఆత్మీయ లోతును బోధించారు.

బాధల్లోనూ నిలిచేది నిజమైన ఆరాధన అని నిరూపించారు.


👉 కింగ్ డేవిడ్ (King David – క్రీ.పూ. 1000 )

పరిశుద్ధ గ్రంథములో ఆరాధన దేవున్ని ప్రేమించిన వాని జీవితము అని చూపించిన వ్యక్తి దావీదు.

ఆయన రచించిన కీర్తనలలో దేవునికి అర్పించే సంపూర్ణ హృదయ ఆరాధన కనిపిస్తుంది.

ఆరాధన అన్నది హృదయ సత్యం అని చూపించిన వ్యక్తి దావీదు.


ఈ 2026వ సంవత్సరంలో ఎన్నో నిర్ణయాలతో, దేవుడిచ్చిన వాగ్దానాలతో, దైవాసక్తి గల ప్రణాళికలతో ముందుకు వెళుతున్న వారందరూ కూడా మనసులో నిశ్చయించుకోవాలి..

ఈ జీవితము దేవున్ని ఆరాధించే జీవితమని.


ఈ నూతన సంవత్సరంలో అటువంటి ఆరాధికులుగా ముందుకు సాగుదాం, ఆరాధికుడు అంటే ఏమిటో లోకానికి చూపిద్దాం.


మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.1కోరింథీ 10:31


Elisha Bonnke


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page